తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెబర్‌ 2 వరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. రాకపోకలకు అంతరాయం.

తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు
X

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం పడుతున్నది. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, చిలకలగూడ, బేగంఏట, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సైదాబాద్‌, చంపాపేట, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట, ప్రగతినగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, తార్నాక, రాంనగర్‌, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. పలుచోట్ల రోడ్లపైకి వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కరిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం పడుతున్నది. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, పరకాల, మహబూబ్‌బాబాద్‌లో వర్షం పడుతున్నది. గార్లలో పాకాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మమబూబ్‌నగర్‌ జిల్లాల్లోని నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌లో ఎవతెరిపి లేని వర్షం కురస్తున్నది.

భద్రాద్రికొత్తగూడెం, జోగులాంబ, గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, ములుగు, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.

Raju

Raju

Writer
    Next Story