రాష్ట్రంలో ఐదు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఐదు రోజులు భారీ వర్షాలు..  పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!
X

రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల ట్రాఫిక్ నిచిలిపోయింది. మరోవైపు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Vamshi

Vamshi

Writer
    Next Story