ప్రజలను అప్రమత్తం చేయండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు

మంథని వద్ద గోదావరి ఉధృతి పరిశీలించిన మంత్రి శ్రీధర్‌ బాబు

ప్రజలను అప్రమత్తం చేయండి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు
X

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి శ్రీధర్‌ బాబు ఆదేశించారు. వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. మంథని సమీపంలో గోదావరిలో వరద ఉధృతిని బుధవారం ఆయన పరిశీలించారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ నేపథ్యంలో మన ప్రాజెక్టుల్లోకి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మంథనిలో డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయాలన్నారు. ఐదు రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలతో అంటువ్యాధులు సోకే ప్రమాదముందని, దోమకాటుతోనే జ్వరాలు రావొచ్చని.. అధికారులు హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. అగ్రికల్చర్‌ ఆఫీసర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పంట నష్టం అంచనా వేయాలన్నారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పాలన్నారు.

Next Story