హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది

Rain
X

హైదరాబాద్‌ పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటికి రావద్దొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్‌, కోఠి, లక్డీకాపూల్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. డ్రైనేజీలు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సాయం కోసం 040 21111111కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అత్యధికంగా 13.9 సెం.మీ, మెదక్‌లో 12.9 సెం.మీ ,కామారెడ్డిలో 10.50 సెం.మీ, వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలో రోడ్లు చెరువులను తలపించాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story