హైదరాబాద్‌‌లో కుండపోత వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో మరోసారి కుండబోత వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి.

Hesvy rain
X

హైదరాబాద్‌లో మరోసారి కుండబోత వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులన్ని చెరువులను తలపిస్తున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి నగరంలో వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్, మాదాపూర్ హైటెక్ సిటీ, బంజారా‌ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

అదేవిధంగా పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్‌పేట్‌, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణ‌గూడ, అబిడ్స్, లక్డీకాపూల్, కోఠి, నాంపల్లి, అఫ్జల్ గంజ్, బేగంబజార్, చార్మినార్ ప్రాంతాల్లో వర్షం భారీ వర్షం కురిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ‌ కీలక ప్రకటన చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా వాహనాల కదలికకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఒకే సమయంలో అందరూ బయటకు రావొద్దని, వేర్వేరు సమయాల్లో రోడ్డు పైకి రావాలని కోరుతున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story