హైదరాబాద్‌లో భారీ వర్షం.. అవసరమైతే తప్పా బైటికి రావొద్దు: జీహెచ్‌ఎంసీ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గంట పాటు కుండపోతగా వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. అవసరమైతే తప్పా బైటికి రావొద్దు: జీహెచ్‌ఎంసీ
X

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీగా వర్షం కురిసింది. నగరంలో గంట పాటు కుండపోతగా వాన పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది. యూసఫ్‌గూడ, కృష్ణానగర్‌లో పడిన వానకు రోడ్లు చెరువులను తలపించాయి. ఈ వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. పలుచోట్ల విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. మదాపూర్‌, హైటెక్‌సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

మారేడుపల్లి ప్రాంతంలో అత్యధికంగా 75.3 మి.మీ., ఖైరతాబాద్‌ ప్రాంతంలో 74 మి.మీ వర్షపాతం నమోదైంది. రాత్రి కూడా భారీ వర్షం పడే అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. కాబట్టిప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బైటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది.

మియాపూర్‌, చందాపూర్‌, లింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్‌, హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్‌, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది.

Raju

Raju

Writer
    Next Story