హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో కుండ పోత వర్షం కురిసింది. ఉరుములు పెనుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Rain in telangana
X

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారి మారిపోయింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది.ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవగా.. పెనుగాలులకు పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్‌, రాయదుర్గం, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఒక్కసారి వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ వారు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.

Vamshi

Vamshi

Writer
    Next Story