హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, యూసుఫ్‌గూడ, బేగంపేట్, ఖైరతాబాద్, మణికొండ, నార్సింగ్, ముషీరాబాద్, బహదూర్‌పూర్, పాత బస్తీ ప్రాంతల్లో వర్షం దంచి కొడుతుంది.

rain
X

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, యూసుఫ్‌గూడ, బేగంపేట్, ఖైరతాబాద్, మణికొండ, నార్సింగ్, ముషీరాబాద్, బహదూర్‌పూర్, పాత బస్తీ ప్రాంతల్లో వర్షం దంచి కొడుతుంది. తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని చెప్పింది. ఆసిఫాబాద్‌, నిర్మల్‌,నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Vamshi

Vamshi

Writer
    Next Story