తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటి విడుదల

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యంతర ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తుతున్నది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో పడిన వర్షాలకు భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 46 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరుతో పాటు చింతవాగు, రోటెంత వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏఈ ఉపేందర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకుని వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.3 అడుగులు

భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.3 అడుగులు ఉన్నది. గోదావరి నుంచి దిగువకు 9,74,666 క్యూసెక్కులు వదులుతున్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. లోతట్లు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి భారీ వర్షం పడింది. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూర్‌, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, నాగిరెడ్డిపేట, సదాశివనగర్‌, డొకేశ్వర్‌, వేల్పూరు, రెంజల్‌, ఎడపల్లి మండలాల్లో వర్షం కురిసింది. డొకేశ్వర్‌ మండలం తొండాకారులో 16 సెం. మీ వర్షపాతం నమోదైంది.

సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద

సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నది ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 45 వేల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 27.81 టీఎంసీలు కాగా.. పూర్తి నీటిమట్టం 29.91 టీఎంసీలుగా ఉన్నది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రత్తమంగా ఉండాలని అధికారులు సూచించారు. సింగూరు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. జెన్‌కో గేట్ల ద్వారా 2,700 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరం త్రివేణి సంగమానికి వరద ప్రవాహం

కాళేశ్వరం త్రివేణి సంగమానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర్‌ఘాట్‌ మెట్ల పైనుంచి గోదావరి, ప్రాణహిత ప్రవహిస్తున్నాయి.కాళేశ్వరం లక్ష్మీ బ్యారెజ్‌కు వరద తగ్గింది. బ్యారేజ్‌కు 7,71,580 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండగా.. 85 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజ్‌కు 3,60,716 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది.

Raju

Raju

Writer
    Next Story