ఎమ్మెల్సీ క‌విత బెయిల్ పిటిష‌న్‌పై నేడు విచార‌ణ‌..సర్వత్రా ఉత్కంఠ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.

kavitha
X

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు కవిత. మహిళగా, రాజకీయ నేత, ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ ఎమ్మెల్సీ తరపు వాదనలు రానున్నారు.

ఆమె ఇటీవ‌లే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికాగా, ఢిల్లీ ఎయిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ క‌విత మార్చి 15వ తేదీ నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. క‌విత త‌ర‌ఫున ప్రముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందనే న‌మ్మ‌కంతో బీఆర్ఎస్ నాయ‌క‌త్వం ఉంది. ఈ తరుణంలోనే… 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రాండ్ వెల్కమ్‌ చెప్పానున్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story