రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: కేటీఆర్‌

రాష్ట్రంలో డెంగీ సమస్య తీవ్రంగా ఉన్నదని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: కేటీఆర్‌
X

రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితి, అంగన్‌వాడీ కేంద్రాల్లో దుస్థితిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ప్రభుత్వ తీరుపై ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళ్లి గడ్లు ఇచ్చి పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. డెంగీతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం మరణాలు లేవంటూ వాస్తవాలు దాచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పాలన పడకేసింది. హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారుతో విద్యార్థులు ఆస్పత్రుల పాలై కొందరు చనిపోయినా ప్రభుత్వంలో చలనం రాలేదు.

పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమా?

హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రభుత్వ పర్యవేక్షణ లేదన్నది అనేక ఘటనలు రుజువు చేశాయి. పసి పిల్లల ప్రాణాలతోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఓ నెటీజన్‌ పోస్టు చేసిన వీడియాపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఈ ఇది దారుణమని మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లు ఇస్తున్నారు.భువనగిరి, పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్‌వాడీ కేంద్రంలో ఇది చోటు చేసుకున్నది. ఆ కుళ్లిన గుడ్లు చిన్న పిల్లలు తింటే ఏంటి పరిస్థితి?చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ?మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు?ఓ వైపు గురుకులాల్లో మరణాలు.. మరోవైపు అంగన్‌వాడీల్లో అడుగడుగునా అలసత్వం పిల్లల పాలిట యమపాశంగా తయారైన కాంగ్రెస్ సర్కార్? అని నెటీజన్‌ ప్రశ్నించారు. దీనిపై యాదాద్రి జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించిన తగిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ కోరారు.

డెంగీ మరణాలపై నిజాలు ఎందుకు దాస్తున్నది?

ఒకవైపు రాష్ట్రంలో రాష్ట్రంలో డెంగీ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతున్నది. మరోవైపు పత్రికల్లో డెంగీ తో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల కిందటే డెంగీ కారణంగా ఐదుగురు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈరోజు మరో ముగ్గురు చనిపోయినట్లు వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నాం. మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవు. ఒకే బెడ్ పై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితిపై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగీ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story