విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇక ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష

టెట్ అభ్య‌ర్థుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పించింది.

Tet exam
X

టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ టెస్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ రాసుకోవచ్చని జీవోలో తెలిపింది. అయితే టెట్‌లో ఉత్తీర్ణ‌త సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. టెట్ మార్కుల‌ను డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వ‌నున్నారు. గతంలోనే నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ (ఎన్​సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా టెట్ గడువును జీవితకాలానికి పెంచింది కేంద్ర ప్ర‌భుత్వం.

దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రమే రాసుకోవచ్చు.షెడ్యూల్‌ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్ష, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు వెంటవెంటనే ఉన్నాయి. అయితే ఇవి రెండూ ఒకదాని వెంటే మరొకటి నిర్వహిస్తుండడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. డీఎస్సీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని అభ్యర్థులు గతకొంతకాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. శుక్రవారం నాడు డీఎస్సీ వాయిదా, గ్రూప్‌-1 మెయిన్స్‌తోపాటు పలు సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ ముట్టడించిన విషయం తెలిసిందే..

Vamshi

Vamshi

Writer
    Next Story