హసీనాను బంగ్లాకు అప్పగించండి.. బీఎన్‌పీ డిమాండ్‌

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

హసీనాను బంగ్లాకు అప్పగించండి.. బీఎన్‌పీ డిమాండ్‌
X

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ భారత్‌ను డిమాండ్‌ చేసింది. హసీనాకు పొరుగు దేశం ఆశ్రయం కల్పించడం విచారకరమని పేర్కొన్నది. హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరింది.పలు ఆరోపణలపై ఆమెను విచారించడానికి బంగ్లాదేశ్‌ ప్రజలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయని .. హసీనా విచారణను ఎదుర్కోనివ్వాలని బీఎన్‌పీ పార్టీ సెక్రటరీ జనరల్‌ జనరల్‌ మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లామ్‌ ఆలంగీర్‌ పేర్కొన్నారు.

రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మాజీ ప్రధాని, ఆమె అనుచరులపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు హసీనాపై 31 కేసులు నమోదయ్యాయి. ఇందులో 26 హత్యా అభియోగాలపై నమోదవడం విశేషం. మారణహోమానికి కారకులయ్యారనే ఆరోపణలపై నాలుగు కేసులు, కిడ్నాప్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్​ యూనస్‌ ఖాన్‌ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే.

Raju

Raju

Writer
    Next Story