డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ –2 పరీక్షలు

కొత్త షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్

డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ –2 పరీక్షలు
X

గ్రూప్ – 2 పరీక్షల కొత్త షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం ప్రకటించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 7, 8 తేదీల్లో గ్రూప్ –2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. డీఎస్సీ పరీక్షలు ముగిసిన రెండు రోజులకే గ్రూప్ –2 పరీక్షలు పెడితే రెండు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి నష్టం కలుగుతుందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం గ్రూప్ –2 పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేసింది. గ్రూప్ –2లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయి. పరీక్షలు ప్రారంభమయ్యే వారం రోజుల ముందు హాలిటికెట్లను టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పెడుతామని, అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ వెల్లడించింది.

Next Story