సెప్టెంబర్ 21న గ్రామ పంచాయతీ తుది ఓటరు జాబితా : పార్థసారథి

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా తయారీ, ప్రచురణ పురోగతిపై రాష్ట్ర ఎన్నికల కమీషర్ పార్థసారథి జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

pachayati
X

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా తయారీ, ప్రచురణ పురోగతిపై రాష్ట్ర ఎన్నికల కమీషర్ పార్థసారథి జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఓటరు జాబితాను సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించలని కమీషర్ తెలిపారు. జాబితపై 13వ తేదీ వరకు అభ్యంతరాలను మండల అధికారులకు స్వీకరించి జిల్లా పంచాయతీ అధికారులకు తెలిపాలని పార్థసారథి పేర్కొన్నారు. సవరించిన తుది ఓటరు జాబితాను సెప్టెంబర్ 21న ప్రచురణ ఉంటుందని ఎన్నికల కమీషన్ తెలిపింది.

జిల్లాలోని గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఫోటోతో కూడిన ఓటర్ జాబితా రూపకల్పన చేయాలని అన్నారు. ఓటరు జాబితా నుంచి గ్రామ పంచాయతీ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వార్డుల వారీగా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆయన సూచించారు .ఎన్నికల నిర్వహణకు గ్రామంలోని వార్డుల వారీగా అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలనిర్వహణకు అవసరమైన మేర సిబ్బందిని గుర్తించి వారి వివరాలను అందజేయాలని, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులుగా విధులు నిర్వహించే వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు వీలుగా ప్రతి జిల్లా నుంచి 10 మంది రీసోర్స్ పర్సన్ ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి శిక్షణకు పంపాలని అన్నారు. ఈ వీడియో సమావేశములో లోకేశ్‌కుమార్, పంచాయతీ రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ ఎన్నికల సంఘ అధికారులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story