ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలి : కేటీఆర్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో నంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.

KTR
X

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ జీవో నంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ జీవో నంబర్ 46 అభ్యర్థులు కేటీఆర్‌ను నందినగర్ లోని నివాసంలో కలిశారు. ఎన్నికలకు ముందు జీవో నంబర్ 46 ను రద్దు చేస్తామని నమ్మబలికితే సీఎం రేవంత్‌రెడ్డి గెలిచేందుకు సహకరించామని కానీ గెలిచిన తర్వాత పట్టించుకోవటం లేదని అభ్యర్థులు కేటీఆర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఈ సమస్యకు సంబంధించి గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో మాట్లాడిన అంశాన్ని కేటీఆర్ వారికి గుర్తు చేశారు. అదే విధంగా ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం వారి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అందుకు బీఆర్ఎస్ నుంచి కాావాల్సిన సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. కోర్టు కేసులను తప్పించుకుంటూ అభ్యర్థులకు అన్యాయం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. ఈ విషయంలో తమ పార్టీ నాయకులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తున్న విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. జీవో నంబర్ 46 విషయంలో పోరాటం చేస్తున్న అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తమ సమస్య తీరే వరకు అండగా ఉంటామని ధైర్యమిచ్చిన కేటీఆర్‌కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాకేష్ రెడ్డి పాల్గోన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story