తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు పారదర్శకంగా అందించేందుకు దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు పై లడ్డు ప్రసాదాల జారి ప్రారంభించామని ఈఓ శ్యామలరావు తెలిపారు

TTD
X

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అలిపిరి కాలి నడక మార్గంలోని భక్తులకు సైతం మార్గ మధ్యలో ఉచిత దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలోనే ఈ విధానం అమల్లో ఉంది. తిరుమల మెట్లదారిలో.. మార్గమధ్యలో ఉచిత దర్శనం టోకెన్లు అందజేస్తున్నారు. అలిపిరి మార్గంలో ఈ విధానం లేదు. ఇప్పుడు కొత్తగా అలిపిరి మార్గంలోనూ ఫ్రీ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ఆలయాల్లో లడ్డూలు విక్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్‌లో ఉండే వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో రూ.50కి లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాన్ని విక్రయిస్తారు. ఇప్పటి వరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజు లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి తెలిపారు. టీటీడీలో ఏఇ పోస్టుల నియామకానికి సంభంధించిన ప్రకియ బ్రహ్మోత్సవాలు తరువాత ప్రారంభిస్తామని ఈఓ శ్యామలరావు చెప్పారు.

Vamshi

Vamshi

Writer
    Next Story