రెండో రోజూ స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

మంగళవారం తగ్గిన పసిడి, వెండి ధరలు బుధవారం పెరిగాయి. రెండో రోజూ కూడా స్వల్పంగా పెరిగాయి.

రెండో రోజూ స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

పెండ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. పసిడి మన సంస్కృతి, సంప్రదాయాలలో ముడిపడిపోయింది. అంతేకాదు పెట్టుబడి పెట్టడానికి బంగారం మంచి సాధనం కూడా. అందుకే అభరణాల తయారీకి కాకుండా ప్రస్తుతం చాలామంది బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పసిడికి మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడింది.

బంగారంతో పాటు వెండికి కూడా గిరాకీ బాగానే ఉన్నది. అందుకే వీటి ధరలను ఎప్పటిప్పుడు తెలసుకోవడం ముఖ్యం. బంగారం దేశంలోని ప్రధాన నగరాలలో ఎలా ఉన్నదో తెలుసుకుందాం.

ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగి రూ. 73,430కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,310గా ఉన్నది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 73,580, రూ. 67, 860

హైదరాబాద్‌లో రూ. రూ. 73,430, రూ. 67,310

విజయవాడలో రూ. 73,430, రూ. 67, 310

ముంబాయిలో రూ. 73,430, రూ. 67, 460

కోల్‌కతాలో రూ. 73,430, రూ. 67, 310

చెన్నైలో రూ. 74,030, రూ. 67,860


ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 95,600

హైదరాబాద్‌లో రూ. 1,00,100

విజయవాడలో రూ. 1,00,100

బెంగళూరులో రూ. 95,600

చెన్నైలో రూ. 1,00,100

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Raju

Raju

Writer
    Next Story