గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నది. నేడు ఉదయానికి 51 అడుగులను దాటింది.

గోదావరి ఉగ్రరూపం
X

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నది. నేడు ఉదయానికి 51 అడుగులను దాటింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఉదయం 6 గంటలకు సీడబ్ల్యూసీ అధికారులు విడుదల చేసిన అంచనా ప్రకారం నీటిమట్టం 51. 5 అడుగులకు చేరింది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నిన్న సాయంత్రమే పోలీస్‌శాఖ, రెవెన్యూ యంత్రాంగం కూడా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పడుతున్న వానలకు తోడు ఎగువన కురుస్తున్న వర్షాలకు సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. ఒక్కో అడుగు పెరుగుతుండటంతో ముంపు ప్రాంతాలు, అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద ఉధృతికి ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 53 అడుగులకు చేరుతుందుని అధికారులు భావిస్తున్నారు. నిన్న సీఎస్‌ కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలలో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించారు.

Raju

Raju

Writer
    Next Story