వరద నష్టం వివరాలు వారంలో ఇవ్వండి: సీఎస్‌

అధికారులకు సీఎస్‌ శాంతికుమారి ఆదేశం

వరద నష్టం వివరాలు వారంలో ఇవ్వండి: సీఎస్‌
X

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను వారం రోజుల్లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ జరిగిన నష్టం అంచనా వేయడానికి మంగళవారం సెక్రటేరియట్‌లో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలతో సీఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ అనేక జిల్లాల్లో వానలు, వరదలు తగ్గుముఖం పట్టలేదని అన్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి, తగిన జీపీఎస్‌ కో ఆర్డినేట్‌లతో సమర్పించాలని ఆదేశించారు. అలాగే సీఎం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాడానికి అవసరమైన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఎలంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సీఎస్‌ ఆదేశించారు.

Raju

Raju

Writer
    Next Story