ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో గంజాయి కలకలం..ఇద్దరు జూనియర్‌ డాక్టర్లు అరెస్ట్

హైదరాబాద్‌ కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు

gajai
X

కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ వద్ద జూనియర్ గంజాయి గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోహైదారాబాద్ సుల్తాన్‌ బజార్‌ పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్రవారం డాక్టర్ మణికందన్, డాక్టర్ అరవింద్‌లకు పెడ్లర్‌ సురేశ్‌ సింగ్‌ గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో జూనియర్‌ డాక్టర్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలింది. వారిపై కేసు నమోదు చేశారు.

ఇద్దరు జూనియర్‌ డాక్టర్లతో పాటు గంజాయి పెడ్లర్‌ సురేశ్‌ సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 80 గ్రాముల గంజాయి, 2 మొబైల్‌ ఫోన్స్‌ సీజ్‌ చేశారు. మెడికల్‌ కాలేజీలో ఇంకా ఎవరైనా గంజాయి తీసుకుంటున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో నలుగురు జూనియర్‌ డాక్టర్లు కూడా గంజాయి తీసుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మెడికల్ కాలేజీలో ఇంకా ఎవరెవరు గంజాయి కొంటున్నారనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Ganja riot in Osmania Medical College..Two junior doctors arrested

Vamshi

Vamshi

Writer
    Next Story