రక్షణ లేకుండా విధులు నిర్వహించలేం

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా నిమ్స్‌లో వైద్యులు విధులు బహిష్కరించారు. వైద్య సిబ్బంది రక్షణ కోసం సెంట్రల్‌ ప్రొటక్షన్‌ యాక్ట్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

రక్షణ లేకుండా విధులు నిర్వహించలేం
X

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా నిమ్స్‌లో వైద్యులు విధులు బహిష్కరించారు. నిమ్స్‌లో వైద్యులు, సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించింది. రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళన చేపట్టారు. మాకు న్యాయం కావాలని నినదించాచు. అత్యవసర సేవలకు మాత్రం ఆటంకం ఉండబోదని వైద్యులు, సిబ్బంది తెలిపింది.

ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది రక్షణ కోసం సెంట్రల్‌ ప్రొటక్షన్‌ యాక్ట్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఘటనలు జరిగినప్పుడే రాజకీయ పార్టీలు, నేతలు స్పందిస్తున్నారు. డాక్టర్లపై లైంగికదాడులు, హత్యలు కొత్తవేమీ కాదన్నారు. అందుకే ముందు డాక్టర్ల ప్రాణాలను కాపాడాలని వాళ్లు కోరుతున్నామన్నారు. తాము కోరుతున్నది రక్షణ ఒక్కటేనని, మాకు భద్రత లేకుండా ఎలా పనిచేయగలుగుతామని ప్రశ్నించారు. ఒక్కో డాక్టర్‌ 24 గంటలూ పనిచేయడానికి తాము సిద్ధమన్నారు. కోల్‌కతాలో డాక్టర్‌పై దాడి జరిగింది. ఆమె డాక్టరే కాదు ఒక మహిళ అని, మహిళపై ఇటీవల కాలంలో అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహిళలు రోడ్లపై రావడమే నేరంగా మారిపోయిందని వాపోయారు. కాబట్టి ఆడవాళ్లు పనిచేసే ప్రతీచోట రక్షణ కావాలని డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story