సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ చైర్మన్ భేటీ..త్వరలో హైదరాబాద్‌కు

సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లి యుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఆయన పలు కంపెనీల ప్రతినిధులు ఆయన కలుస్తున్నారు.

Cm revanth reddy
X

సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లి యుతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఆయన పలు కంపెనీల ప్రతినిధులు ఆయన కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్ చైర్మన్... దేశ రాజధానిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తానని ఈ సందర్భంగా యంగ్ లి యూ చెప్పారు. పరిశ్రమలు, సేవా రంగాలను విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి విజన్ అద్భుతమని కొనియాడారు.

హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత ఉందన్నారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎల‌క్ట్రానిక్స్‌-ఎల‌క్ట్రిక‌ల్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇలా బ‌హుముఖంగా అభివృద్ధి చేయ‌నున్నామ‌ని సీఎం తెలిపారు. ప్ర‌స్తుత ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన స్కిల్స్‌ను యువ‌త‌కు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీని ప్రారంభిస్తున్నామ‌న్నారు. న‌వ త‌రం ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాలు, వాటికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు, భ‌విష్య‌త్తులో ఆయా ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాలు తీర్చే మాన‌వ వ‌న‌రుల‌ను అందించేందుకు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌నలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లను భాగ‌స్వాముల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు. అందులో భాగంగానే స్కిల్ యూనివ‌ర్సిటీకి ఆనంద్ మ‌హేంద్ర‌ను ఛైర్మ‌న్‌గా, మ‌రో పారిశ్రామిక వేత్త శ్రీ‌నివాస రాజును వైస్ ఛైర్మ‌న్‌గా నియ‌మించామ‌ని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story