వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాజీనామా

ప్రకాశం జిల్లా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైసీపీకీ గుడ్ బై చెప్పారు.

వైసీపీకి మాజీ మంత్రి శిద్దా రాజీనామా
X

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీకీ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 2014 లో చంద్రబాబు హయంలో మంత్రిగా పని చేశారు.

Also Read - ఏపీ మాజీ సీఎం జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

2019లో ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం తెలుదేశం పార్టీకి రాజీనామా వైసీపీలో చేరారు. 2024లో దర్శి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు. అధినేత జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో మనస్థాపం చెందారు. ప్రస్తుతం టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story