మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌

పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ ఇవ్వాలని కోరుతూ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌
X

ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్ల రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో బైటికి వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం అడ్డుకున్న వారిపై దాడి కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లిని ప్రస్తుతం ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉన్నది.

అంతకుముందు పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ ఇవ్వాలని కోరుతూ.. రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లు అన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులను రద్దు చేస్తూ ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం వేసిన నాలుగు పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసుల తరఫున న్యాయవాది అశ్వినీ కుమార్‌ వాదించగా..ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్‌రావు వాదించారు.

Raju

Raju

Writer
    Next Story