బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్!

ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Soren
X

ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయనతో పాటు మరో ముగ్గురు జేఎంఎం ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల జైలుకు వెళ్లినప్పుడు సీఎం బాధ్యతలు చంపై చూసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చంపాయీ జలవనరులశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. హేమంత్‌ వచ్చాక ఆయన రాజీనామా చేయడంపై బీజేపీ ఎంపీ దీపక్‌ ప్రకాశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగివారు. ఆయన చేసిన కృషికి రాష్ట్రంలోని ప్రజలు ఎంతో సంతోషించారు. ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం బాధాకరం. ఓ మంచి వ్యక్తిని సీఎం కుర్చీ నుంచి దింపేశారు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఆయన చేసిన తప్పు ఏంటి..?’’ అని దీపక్ ప్రశ్నించారు. చంపాయీ బీజేపీలో చేరడం పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని దీపక్‌ వ్యాఖ్యానించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీతో చేతులు కలుపుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story