తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు
X

తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ పైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్‌ ఏర్పాటైంది. ఈ కమిషన్‌లో ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులు ఉంటారు. త్వరలోనే వీరిని ప్రభుత్వం నియమించనున్నది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విద్యా కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు విద్యా సంస్థల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే-2021 ప్రకారం పేద విద్యార్థుల్లో క్షీణిస్తున్న అభ్యసన ఫలతాలు.. వర్సిటీల స్థాయిలో తగ్గిపోతున్న నైపుణ్యాలను గాడిలో పెట్టేలా కమిషన్‌కు రూపకల్పన చేసింది. నైపుణ్యాలు పెంచడంతో పాటు మారుతున్న కాలానికి అనుగునంగా విద్యావ్యవస్థలో మార్పులే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలన్నది ఈ కమిషన్‌ లక్ష్యం.

Raju

Raju

Writer
    Next Story