రోజంతా ఒడిదొడుకులు.. స్వల్ప శ్రేణికే సూచీలు పరిమితం

రోజంతా స్వల్పశ్రేణిలో కదలాడిన సూచీలు స్వల్పశ్రేణికే పరిమితమై నష్టాల్లో ముగిశాయి.

రోజంతా ఒడిదొడుకులు.. స్వల్ప శ్రేణికే సూచీలు పరిమితం
X

స్టాక్‌ మార్కెట్‌లో మొదటి నుంచి చివరి వరకు పరిమిత శ్రేణిలోనే కదలాడిన సూచీలు కీలక పరిణామాలేవీ లేకపోవడంతో నష్టాలతో ముగిశాయి. మార్కెట్‌లో ర్యాలీ పరుగులు పెట్టడానికి దోహదపడే కొత్త అంశాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణితో వ్యవహరించడమే దీనికి కారణం. సెన్సెక్స్‌ ఒక దశలో 264.77 పాయింట్ల వరకు కోల్పోయినప్పటికీ మళ్లీ తేరుకుని 36.22 పాయింట్ల నష్టంతో 79.960.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ బాటలోనే నిఫ్టీ కూడా స్వల్ప నష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 3.30 పాయింట్లు కోల్పోయి 24,320.55 దగ్గర స్థిరపడింది.

బ్యాకింగ్‌, టెలికాం, స్థిరాస్థి షేర్లలో లాభాలు పొందాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కాస్త తగ్గి 83.50 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 0.97నష్టంతో 85.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది. ఇక పేటీఎంను 100 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 8.30 కోట్ల) కంపెనీగా చేయడమే లక్ష్యంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ శర్మ ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఇంట్రాడేలో 9.87 శాతం దూసుకెళ్లిన షేరు. రూ. 479.70 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 8.13 శాతం లాభంతో రూ. 472.50 వద్ద ముగిసింది.

Raju

Raju

Writer
    Next Story