ఉత్తరాఖండ్‌లో వరదలు.. తాళ్లపై ట్రాలీ ద్వారా నిత్యావసరాలు

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిత్యావసర సరుకులను అందించడానికి సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

ఉత్తరాఖండ్‌లో వరదలు.. తాళ్లపై ట్రాలీ ద్వారా నిత్యావసరాలు
X

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిత్యావసర సరుకులను అందించడానికి సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ట్రాలీల ద్వారా నితావసరాల సరుకులను చేరవేస్తున్నారు. తాళ్లపై ట్రాలీ ఏర్పాటు చేసి నిత్యావసరాలను పంపుతున్నారు.

కొన్నిరోజులుగా భారీగా వర్షాలు పడుతుండటంతో ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు, రోడ్లు, ఇళ్లు విరిగిపడ్డాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఓ ప్రాంతంలో రోడ్డు అకస్మాత్తుగా కోతకు గురికాగా..ట్రాక్టర్‌ లోయలో పడి నుజ్జునుజ్జు అయ్యింది. భారీ వర్షాలకు ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

సోన్‌ ప్రయాగ్‌, కేదారీనాథ్ రహదారిపై అనేకమంది పర్యాటకులు, యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Raju

Raju

Writer
    Next Story