వరదల్లో మునిగిన ఉత్తర కొరియా

ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ దేశానికి సాయం చేసేందుకు దక్షిణ కొరియా ముందుకొచ్చింది ఆ ప్రతిపాదనను అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తిరస్కరించింది.

Kims
X

ఉత్తర కొరియాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నడుము లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. స్థానిక నదుల్లో ప్రవాహం భారీగా పెరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ స్వయంగా విపత్తు సహాయక చర్యల్లో పాల్గోన్నారు. విపత్తు సిబ్బందితో పాటు బోటులో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షాల కారణంగా బుధవారం నాటికి 4100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణ నష్టంపై కిమ్‌ సర్కారు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

విపత్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. 2019 నుంచి దక్షిణ కొరియాతో ఉత్తరకొరియా దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కరోనా సమయంలో కిమ్‌ రాజ్యానికి సాయం చేస్తామని దక్షిణ కొరియా ప్రకటించినప్పటికీ.. అందుకు ఉ.కొరియా తిరస్కరించడం గమనార్హం. ఉభయ కొరియా దేశాల మధ్య ఉద్రిక్తతలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి. క్షిపణి ప్రయోగాలతో కిమ్‌ కవ్వింపులు.. సియోల్‌ యుద్ధ సన్నాహాలతో నిత్యం ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంటుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story