రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతుల ధర్నా

ఆర్మూర్‌ లో నిరసన తెలిపిన రైతు ఐక్య కార్యాచరణ కమిటీ

రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతుల ధర్నా
X

రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్మూర్‌ లో రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేప్టటిన ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కొర్రీలతో రుణమాఫీని ఎగవేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెల్ల రేషన్‌ కార్డులు, పీఎం కిసాన్‌ అందుతున్న వాళ్లకే రుణమాఫీ వర్తింపజేయడంతో లక్షలాది మంది రుణమాఫీకి దూరమయ్యారని తెలిపారు. నిత్యం రైతులు రోడ్లపైకి వచ్చి రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల రుణాలు మాఫీ చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.





Next Story