జిట్టా బాలకృష్ణ అంత్యక్రియలపై భువనగిరిలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ ఉద్యకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలను అధికారికంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు భువనగిరి పట్టణంలో నిరసన చేపట్టారు.

Jitta
X

తెలంగాణ ఉద్యకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలను అధికారికంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమానులు భువనగిరి పట్టణంలో నిరసన చేపట్టారు. నివాళులర్పించడానికి వచ్చిన స్ధానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేష్‌ను అభిమానులు అడ్డుకొని నిరసన తెలిపారు.

భువనగిరికి చేరుకున్న ఆయన మృతదేహానికి భువనగిరి చెరువు కట్ట వద్ద నుంచి ఆయన అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకువచ్చారు. మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Vamshi

Vamshi

Writer
    Next Story