రుణమాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదు: డిప్యూటీ సీఎం భట్టి

లెక్కలు కాదు ఆత్మ ఉండాలి.. 18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చామని. రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్లు మాత్రమే చేరాయని బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు.

రుణమాఫీ వారం ఆలస్యమైనా ఫలితం ఉండదు: డిప్యూటీ సీఎం భట్టి
X

లెక్కలు కాదు ఆత్మ ఉండాలి.. 18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చామని. రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్లు మాత్రమే చేరాయి. రుణాల మాఫీలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ప్రజా భవన్ లో ఏర్పాటు చేసిన బ్యాంకర్స్ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నాం. వ్యవసాయరంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తాం. రుణమాఫీ, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, భారీ మధ్యతర సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నాం. ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందిస్తున్నాం. రెండు లక్షల రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నాం. ఇవన్నీ వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేస్తాయన్నారు.

వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తున్నది. ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నాం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి 36 వేల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నారు దీనిద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుంది. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించండని కోరారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నాం. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయండి

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో ప్రాధాన్య రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. మొదటి క్వార్టర్ లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62% వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం అన్నారు.

రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి క్వార్టర్లో 127. 29 శాతానికి మెరుగుపడడం మరో ఆసక్తికరమైన అంశం అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా మా ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల ఎఫ్సీఐ వరిని సరఫరా చేసే రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుంది.రాబోయే క్వార్టర్లో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేస్తారని ఆశిస్తున్నానని డిప్యూటీ సీఎం తెలిపారు.

రుణమాఫీ పూర్తికి బ్యాంకర్ల సంపూర్ణ సహకారం కావాలి: తుమ్మల

బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎంతో కలిసి పాల్గొన్న మంత్రి వ్యవసాయశాఖ మాత్యులుతుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..భగవంతుడు దయ వల్ల పుష్కల వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ వానకాలంలో కూడా అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని ఆశిస్తున్నాను. కష్టకాలంలో కూడా ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 18,000 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. కింది స్థాయిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు రుణఖాతాలో తప్పులు సరిదిద్దేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను మంత్రి కోరారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయడానికి మీ సహకారం కావాలన్నారు. అంకెలు చదువుకొని 3 నెలలకోసారి మీటింగ్ లు పెట్టడం వలన, బ్యాంకర్ల సదస్సు నిర్వహణకు అర్థం లేదన్నారు. అవి వినియోగదారులకుప్రయోజనాలు నిమ్న వర్గాలకు, లక్షిత వర్గాలకు ఆర్థిక ఫలాలు చేరేటట్లు చేయాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story