మాదిగ కులాల మధ్య సమానత్వం సాధించాలి: దామోదర

మాదిగ కులాలు, ఉపకులాల మధ్య సమానత్వం తీసుకురావడానికి జాతికి నాయకత్వం వహిస్తున్నవారు కృషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

మాదిగ కులాల మధ్య సమానత్వం సాధించాలి: దామోదర
X

మాదిగ, మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు రావాలన్నారు. కులాలు, ఉపకులాలు అని కాకుండా సమానత్వం అనేది సాధించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ రాష్టాలు చేసుకోవచ్చని తీర్పునిస్తూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాదిగ ఉపకులాల సమావేశం ఈ రోజు ప్లాజా హోటల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కోర్టు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని స్వాతంత్రం ఇచ్చింది తప్ప అమలు చేయాలని ఆదేశించలేదన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు లాయర్లు, ప్రజాప్రతినిధులు సంఘాల నాయకులు, ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసుకొని ముందుకు వెళ్లాలన్నారు. అలాగే గతంలో జరిగిన వర్గీకరణ ఇప్పుడున్న తెలంగాణ కు వర్తిస్తుందా లేదా అని ఆలోచించాలన్నారు. కుల గణన చేయడం, జాతికి నాయకత్వం వహిస్తున్న వారితో కమిటీ వేసుకొని మేధోమథనం చేసిన తర్వాత ఒక నివేదిక రూపంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. అన్నికులాల సామాజిక,ఆర్థిక , స్థితిగతులను తెలుసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి వర్గీకరణ విషయంలో సానుములంగా ఉన్నారు. విద్య, ఉద్యోగాల ద్వారా కేవలం 15 శాతం మందికే అవకాశాలు దక్కుతాయని.. మరి మిగతా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వమే యాభై శాతం సబ్సిడీలతో లోన్లు కూడా ఇచ్చేవిధంగా చూస్తామన్నారు. ప్రతి మనిషి సిద్ధాంతపరులు, సంస్కారవతులైనప్పుడే జాతి బాగుపడుతుంది అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మీనారాయణ, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల శామ్యూల్, వేముల వీరేశం, కాలే యాదయ్యలతో పాటు ప్రొ.జి. మల్లేశం, లు మెడి పాపయ్య మాదిగ, కొండ్రు మల్లయ్య, తురుపాటి హన్మంతు, చంద్ర మౌళి, కార్న్ కంటి రాములమ్మ, రోహిదాస్ వాగజేమేరే, ఓయూ నుండి కూడా పలువురు పాల్గొన్నారు. వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, పెంట కృష, చేరు కూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Raju

Raju

Writer
    Next Story