తైవాన్‌లో భూకంపం.. రిక్టేర్‌ స్కేల్‌పై 6.3గా నమోదు

తైవాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టేర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు.

తైవాన్‌లో భూకంపం.. రిక్టేర్‌ స్కేల్‌పై 6.3గా నమోదు
X

తైవాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టేర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైంది. తైవాన్‌ తూర్పునగరం హువాలియన్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడింది. 9.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నది. 24 గంటల వ్యవధిలో ఇది అక్కడ సంభవించిన రెండో భూకంపం. మరోవైపు భూకంప ప్రభావంతో దేశ రాజధాని తైపీలోని భవనాల్లో ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు.

తైవాన్‌లోని హువాలియన్‌లో 7.5 తీవ్రతతో ఏప్రిల్‌ 3న భారీ భూకంపం సంభవించింది. అప్పుడు దాదాపు 14 మంది మృతి చెందారు. తర్వాత ఏప్రిల్‌ 22న మరోసారి భూకంపం వచ్చింది. తైవాన్‌లో భూకంపాలు కొత్తేమీ కాదు. ఇక్కడ సర్కమ్‌-పసిఫిక్‌ సిస్మిక్‌ బెల్టులో ఉన్నది. ఈ ద్వీపం టెక్టోనిక్‌ ఫలకానికి దగ్గరంగా ఉంటుంది. దీంతో తరచుగా భూకంపాలకు గురవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story