సీఎం అమెరికా పర్యటనలో.. 10 కంపెనీలతో ఒప్పందం

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన సందర్బంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి.

Cm revanth reddy 3
X

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన సందర్బంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరుకు కాగ్నిజెంట్ (15 వేల ఉద్యోగాలు) వాల్ష్ కార్రా హోల్డింగ్స్, తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడులు, ఆర్సీసియం, స్వచ్చ్‌బయో రూ.1000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 500 మందికి ఉద్యోగాలు, ట్రైజిన్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవెలప్మెంట్, డెలివరీ సెంటర్ దాదాపు 1000 ఉద్యోగాలు వస్తాయి.హెచ్​సీఏ హెల్త్ కేర్ కంపెనీతో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరించనున్నారు.

కార్నింగ్, వరల్డ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం ఉంటాయి. వివింట్ ఫార్మా ద్వారా రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. చార్లెస్ స్క్వాబ్ హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్ స్థాపించనున్నారు. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు పలు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story