జూబ్లీహిల్స్ పబ్‌లో డ్రగ్స్ కలకలం..11 మంది అరెస్ట్‌ !

జూబ్లీహిల్స్ పబ్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుండడంతో నార్కోటిక్ బ్యూరో జూబ్లీహిల్స్ పోలీసులు సోదాలు జరిపారు.

Drungs
X

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ పబ్‌లో నార్కొటిక్స్‌ పోలీసులు ఆదివారం రాత్రి సోదాలు చేశారు. జొరా పబ్‌లో తనిఖీలు చేయగా నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చిది. దుర్గం చెరువులోని ఆలివ్‌ బిస్ట్రో పబ్‌లో కూడా సోదాలు నిర్వహించగా మొత్తం 11 మంది డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు.

డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అందులో కొందరికి పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జొర పబ్ లో యువకులకు డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? ఎంతకాలంగా డ్రగ్స్ దందా నడుస్తోంది? అనే వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ సేవించిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Vamshi

Vamshi

Writer
    Next Story