విపత్కర పరిస్థితుల్లో డ్రోన్ల టెక్నాలజీని వాడాలి: చంద్రబాబు

తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టి సారించాలన్న సీఎం

విపత్కర పరిస్థితుల్లో డ్రోన్ల టెక్నాలజీని వాడాలి: చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉన్నదని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పలుల శాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎస్‌, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.

వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌ ఇబ్బంది కలుగుతున్నది. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టాలన్నారు. వాగులు, కాల్వలు దాటడానికి ప్రజలను అనుమతించవద్దని అన్నారు. వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్ల వంటి టెక్నాలజీని విరివిగా వినియోగించాలని సూచించారు. విజయవాడలో కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టి సారించాలన్నారు. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనకు కారణాలపై విచారణ చేపట్టాలని తెలిపారు. సీజనల్‌ వ్ఆయధుల దృష్ట్యా మరింత సమర్థంగా పనిచేయాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story