రైతుభరోసా సంపన్నులు, ట్యాక్స్‌ కట్టే వారికి ఇవ్వొద్దు:గుత్తా

రుణమాఫీ, రైతుభరోసా అర్హులకే ఇవ్వాలని, సంపన్నులు, ట్యాక్స్‌ కట్టే వారిని తొలిగించాలని మండలిఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.

రైతుభరోసా సంపన్నులు, ట్యాక్స్‌ కట్టే వారికి ఇవ్వొద్దు:గుత్తా
X

మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాలపై దృష్టి సారించారని శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్టాడిన గుత్తా త్వరలో అన్ని సమస్యలకు పరిష్కరం రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

సాధ్యమైనంత వరకు ఇరు రాష్ట్రాలు సమస్యలపై మాట్లాడుకోవాలన్నారు. సాధ్యం కానివి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.కృష్ణా జలాల పై ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. కృష్ణ జలాలపై ఆధారపడిన వారికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నదని, అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ జరిగినట్లు ఇది కూడా జరగాలని ఆకాంక్షించారు. కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణకే ఎక్కువ అవసరం ఉన్నదన్నారు. నల్గొండలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులు పూర్తవుతాయి అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేవని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. కాబట్టి ప్రాధాన్య అంశాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించాలన్నారు. రుణమాఫీ, రైతుభరోసా అర్హులకే ఇవ్వాలని, సంపన్నులు, ట్యాక్స్‌ కట్టే వారిని తొలిగించాలని గుత్తా చెప్పారు. రైతు భరోసాలో సేద్యం కాని భూములను తొలిగించాలన్నారు. కొన్నిచోట్ల భూములు లేవు కాని పట్టాలున్నాయి అన్నారు. అలాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తొలిగించాలని ప్రభుత్వానికి సూచించారు.

Raju

Raju

Writer
    Next Story