సింథటిక్‌ శాలువాలు వద్దు.. చేనేత శాలువాలు కొనండి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

సింథటిక్‌ శాలువాలు వద్దు.. చేనేత శాలువాలు కొనండి
X

టీచర్స్‌ డే సందర్భంగా ఈనెల 5న ఉపాధ్యాయులను సత్కరించేందుకు సింథటిక్‌ శాలువాలకు బదులు చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన కాటన్‌ శాలువాలే కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. చేనేత శాలువాలు కొంటే నేత కార్మికులకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చినట్టు అవుతుందని తెలిపారు. విద్యాశాఖ అధికారులతో పాటు అన్ని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కాటన్‌ శాలువాలే కొనుగోలు చేయాలని కోరారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలతో పాటు ఏ కార్యక్రమంలోనైనా అతిథులను సత్కరించేందుకు సింథటిక్ శాలువలు కొనడం మానేయాలని కోరారు. ఇకపై అందరూ కాటన్‌, చేనేత శాలువాలనే కొనుగోలు చేయాలని అప్పీల్‌ చేశారు. సింథటిక్‌ వస్త్రాలు, శాలువాలతో పర్యావరణం కూడా దెబ్బతింటుందని తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన కాటన్‌ శాలువలు కొని చేనేత కార్మికులకు అండగా నిలువాలని, చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.

Next Story