కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ము మీకుందా : మహేశ్వర్ రెడ్డి

ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి హైడ్రా డ్రామాలు చేస్తున్నాడని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

MLA Maheswar reddy
X

సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం సోదరుడు, మంత్రి పొంగులేటి పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ము మీకుందా? అని ప్రశ్నించారు. నిత్యం ఏదో సంచలనం చేయడమే రేవంత్ పని మహేశ్వరరెడ్డి అన్నారు.ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సంచలనం చేస్తున్నారని ఆగ్రహించారు.

దానం నాగేందర్ పై హై డ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి చేస్తున్న అలజడి కేవలం దైవర్ట్ పాలిటిక్స్ కోసమేనన్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే హైడ్రాని హైప్ చేస్తున్నారని ఆగ్రహంచారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్‌తో నిర్మాణాలను కట్టుకుని నష్టపోయిన వారికి ఎటువంటి హామీ ఇస్తున్నారని నిలదీశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story