ఉద్యోగాలిచ్చేదాకా వదిలిపెట్టం :కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో గ్రూప్‌-2 లో 2 వేలు, గ్రూప్‌-3లో వేలాదిగా పోస్టులు పెంచుతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్‌లోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు.

ఉద్యోగాలిచ్చేదాకా వదిలిపెట్టం :కేటీఆర్‌
X

నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వినడం లేదని నిరుద్యోగులు కేటీఆర్‌ను కలిసి వారి బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారు. సుమారు 10 పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లూ అంటూ తేదీలు ప్రకటించారు. వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. వెంటనే ఆ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో గ్రూప్‌-2 లో 2 వేలు, గ్రూప్‌-3లో వేలాదిగా పోస్టులు పెంచుతామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్‌లోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. గ్రూప్‌-1 కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన దానికి అదనంగా 60 ఉద్యోగాలు కలిపారు. పోస్టులు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వదిలిపెట్టే సమస్యలేదన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై చట్టసభల్లో నిలదీస్తామన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ వదిలిపెట్టమని హెచ్చరించారు.కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని కేటీఆర్‌ తెలిపారు..

Raju

Raju

Writer
    Next Story