భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : మంత్రి పొన్నం

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ హెచ్చరించింది.

Heavy rains
X

హైదరాబాద్‌లో భారీ వర్షలు కురుస్తున్న నేపధ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Also Read - వైద్య శాఖ మంత్రితో జూడాల చర్చలు విఫలం..సమ్మె కొనసాగింపు

జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించార. ఒక్కసారి వర్షం కురవడంతో రోడ్ల‌పైకి వ‌ర‌ద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఈ వ‌ర‌ద నీటిని తొల‌గించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్న‌ట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఎలాంటి స‌మ‌స్య‌లున్నా 040-21111111, 9000113667కు ఫోన్ చేయాల‌ని తెలిపింది.

Vamshi

Vamshi

Writer
    Next Story