ఏపీలో పింఛన్ల పంపిణీ..తెలంగాణలో ఎప్పుడో ?

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందజేశారు.

CBN12
X

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తాడేపల్లి మండలం పెనుమాకలోని ఎస్టీ కాలనీలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.4వేలతోపాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపురూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉ.6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం సర్కార్ రూ.4,408 కోట్ల నిధులు విడుదల చేసింది. దాదాపు ఇవాళే పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి నీరభ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఇంకా జున్ నెల పెన్షన్ ఇంకా అందలేదు దీంతో లబ్థిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటానే పెంచిన పెన్షన్ అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇంకా నెరవేర్ఛలేదు. ఏపీలో ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంచిన పింఛన్ల పంపిణీ చేయడంతో తెలంగాణ పింఛన్ల దారులకు ఆశలు పెరిగాయి. కానీ రేవంత్‌ సర్కార్ వారి ఆశలపై నీళ్లు చల్లింది.

Vamshi

Vamshi

Writer
    Next Story