హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

Deputy cm
X

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..భాగ్యనగరం అంటే లేక్స్, రాక్స్, సరుస్సులు, రాళ్లు, కొండలు అని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని భట్టి అన్నారు. వీటి కోసం పర్యవరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని చెప్పుకొచ్చారు.

నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి పర్యవరణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తుమ్మడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్-కన్వెన్షన్ కూడా ఒకటి అని.. నిర్మాణాలు కూల్చివేయొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చిందని అనడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరం 12 గుంటల మేర స్థలంలో కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని అన్నారు. ఇక బఫర్ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో కన్వెన్షన్ నిర్మాణం విస్తరించి ఉందని రంగనాథ్ స్పష్టం చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story