విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా  ఏర్పడిన కరెంట్  సమస్యలపై మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

bhatti
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన కరెంట్ సమస్యలపై మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా విద్యుత్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్పీడీసీఎల్ నలుగురు సీఈలు, 16మంది ఎస్ఈలు, 40 మంది డీఈ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను డిప్యూటీ సీఎం తెలుసుకున్నరు. వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం కలిగిన చోట పునరుద్ధరణకు కలెక్టర్ పోలీస్ రెవెన్యూ జిల్లా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని భట్టి కోరారు.

వరదల వల్ల నీట మునిగిన సబ్ స్టేషన్లు, పిడుగులు పడి దెబ్బతిన్న చోట మరమ్మతులు చేయాలన్నారు. పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా వాటి పరిధిలో ఉన్న గ్రామాలకు పక్క సబ్ స్టేషన్ నుంచి విద్యుత్తును సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం పునరుద్ధరణ పై ఎస్ఈ లతో ఎప్పటికప్పుడు సమక్షించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. విద్యుత్ అంతరాయానికి సంబంధించిన సమస్యలు ఉంటే ప్రజలు వాటి పరిష్కారం కోసం విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలని కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story