తెలంగాణలో భారీగా డెంగీ కేసులు నమోదు

ఈ ఏడాది ఇప్పటివరకు 5,372 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడి

తెలంగాణలో భారీగా డెంగీ కేసులు నమోదు
X

రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని కానీ ప్రభుత్వం దీన్ని దాచిపెడుతున్నదని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. దీన్ని అధికారపార్టీ ఖండించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం చెప్పింది అక్షరాల నిజమని తేలింది. రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.తెలంగాణలో నాలుగు రోజుల్లోనే 700 కొత్త డెంగ్యూ కేసులు నమోదు కాగా, మొత్తం కేసులు 5000 దాటాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ కేసులో భారీగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 5,372 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 81,932 నమూనాలను పరీక్షించగా.. అందులో 6.5 శాతం పాజిటివ్‌గా తేలినట్లు ప్రకటించింది. అత్యధికంగా 1,852 మందికి డెంగీ సోకగా.. సూర్యాపేటలో 471, మేడ్చల్‌లో 426, ఖమ్మంలో 735, నల్గొండలో 315, నిజామాబాద్‌లో 286, రంగారెడ్డిలో 232, జగిత్యాలలో 185, సంగారెడ్డిలో 160, వరంగల్‌లో 110 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు 152 మంది చికున్‌ గున్యా, 191 మందికి మలేరియా సోకినట్లు ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ఈ ఏడాది జులైలో ఫీవర్‌ సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ ఇప్పటివరకు 1,42,78,723 హౌస్‌ హోల్డ్స్‌ సర్వే చేసినట్లు పేర్కొన్నది.

Raju

Raju

Writer
    Next Story