కేటీపీఎస్ కూలింగ్ టవర్లు కూల్చివేత

కేటీపీఎస్ కర్మాగారంలో కాలం చెల్లిన కూలింగ్ టవర్లను జెన్కో అధికారులు కూల్చేశారు.

Palvancha
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో 102 మీటర్ల ఎత్తులో ఉన్న కాలం చెల్లిన కూలింగ్ టవర్లను జెన్కో అధికారులు కూల్చేశారు. ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో భాగంగా ఓఅండ్‌ఎంలోని ఎనిమిది కూలింగ్‌ టవర్లను నేలమట్టం చేశారు. మొదట నాలుగు టవర్లను కూల్చివేసిన అధికారులు తర్వాత మరో నాలుగింటిని తొలగించారు. ఓఅండ్‌ఎం కర్మాగారం మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్‌ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే.

పాత కర్మాగారానికి సంబంధించిన కూల్చివేత, అందులోని మెటీరియల్‌ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్‌ఆర్‌ కమర్షియల్‌ కాంట్రాక్టు కంపెనీ రూ.465 కోట్లకు టెండర్‌ను దక్కించుకొని పనులు పూర్తిచేసింది. వారంక్రితమే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా శాసన సభ సమావేశాలు ఉండడంతో వాయిదా వేశారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో ప్లాంట్‌నుంచి విద్యుత్‌ సరఫరా చేసే లైన్లలో రెండుగంటలపాటు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story