తెలంగాణ భవిష్యత్తు తరాలకు దాశరథి నిత్య స్ఫూర్తిదాయకం : కేసీఆర్

తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.. దాశరథి అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొనియాడారు.

kcr
X

తెలంగాణ భవిష్యత్తు తరాలకు దాశరథి నిత్య స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా ‘తిమిరంతో సమరం’ చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి.. దాశరథి అని కొనియాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరం తో సమరం’ చేస్తూ,నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని కేసీఆర్ కొనియాడారు.

Vamshi

Vamshi

Writer
    Next Story