30 నుంచి డీఏవో రాత పరీక్షలు
రాష్ట్రంలో 53 డీఏవో పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్, సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
- By RajuLoading...
- | 23 Jun 2024 4:10 AM GMT
X
లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ వరుసగా విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పూర్తి కాగా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమౌతున్నాయి. ఈ పరీక్షలు జూన్ 24 నుంచి 29 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది.
Also Read - 'కల్కి' మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (డీఏవో) పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి జులై 4 వరకు మల్టీసెషన్స్, సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12:30 పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని పేర్కొన్నది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. డీఏవో పరీక్ష ఇప్పటికే ఒకసారి జరిగింది. అయితే పేపర్ లీకేజీ వల్ల ఈ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే.